కైలాస మానస సరోవరం యాత్ర -- తలుచుకున్న ప్రతీసారీ ఒక దివ్య అనుభూతిని అందించే పరమ పావన యాత్ర.
ఈ యాత్ర కోసం మొదటి సారి జనవరి 19, 2015 న మాట్లాడుకున్నాం. ఆ రోజు నుంచి ఆగష్టు 29 వరకూ కొన్ని వందల సార్లు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఒక సారి టిబెట్ లో అంతగా అనుకూలంగా లేని వాతావరణం వల్ల, ఒక సారి నేపాల్ లో భూకంపం వల్ల, ఇంకొకసారి వీసా దొరక్క, తరువాత ఆఫీసు పనుల వల్ల.. అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. ఒక రోజు యాత్ర జరుగుతుందనే ఆనందం, మరుసటి రోజు జరగదేమో అని అనుమానం, ఇంకొక రోజు ఎందుకు ఇలా జరుగుతోందని బాధ, వేరొక రోజు ఎలాగైనా ఆయనే చూసుకుంటాడులే అని ధైర్యం.
ఎన్నో పరీక్షలు, ఇంకెన్నో అవరోధాలు, చాలా మలుపులు, అలుపు లేని నిరీక్షణలు మధ్య చివరకి ముక్కంటి ఇంటికి వెళ్లి వచ్చాం. అయితే, ఈ క్రమం లో చాలా మొక్కులు మొక్కుకున్నాం. రెండు సార్లు flight tickets cancel చేసుకోవాల్సి వచ్చింది, అంతగా మమ్ము పరీక్షించిన స్వామి కరుణ కోసం, ఎన్నో దేవాలయ్యాలో, అర్జీ పెట్టుకున్నాము. ఇది మొక్కులు ఒక్కొక్కటి గా తీర్చుకురావాల్సిన సమయం.

- సింహాచలం - కొండ మీదకి మెట్లు ద్వారా - 10th Oct 2015 at 6PM
- అయినవిల్లి - వినాయకుని దర్శనం - 2nd Jan 2016 at 10AM
- సర్పవరం - భావన్నారాయణ స్వామి దర్శనం - 2nd Jan 2016 at 7AM
- రుద్రాభిషేకం - సహస్ర లింగేశ్వర స్వామి, పంచదార్ల - 5th Dec 2015 at 12:30 PM
- పద్మనాభం - అనంత పద్మనాభుని దర్శనం - 11-Sep-2015 at 10AM
No comments:
Post a Comment