Friday, June 3, 2016

ఆది శక్తి పీఠాలు

దక్షయజ్ఞమందు అమ్మవారి దేహత్యాగం భరించలేని శివుని శాంతింపజేయుటకు హరి పూనుకున్నాడు.  ఆ విధంగా విష్ణుచక్ర ఖండిత శివానిశరీరభాగాలు భూమిపై శక్తిపీఠాలుగా వెలసినవి.

శివపురాణం ప్రకారం, అమ్మవారు 4 ఆది శక్తిపీఠాలుగా, 51 శక్తి పీఠాలుగా, భరతభూమిలో వెలిసింది.  ఆది శంకరులు మనకు 18 మహాశక్తిపీఠాలను శ్లోకంగా అందించారు.  దేవీభాగవతం ప్రకారం 108 శక్తిపీఠాలు ఉన్నాయి. శక్తి పీఠాలపై పూర్తి సమాచారం చదవండి.  అష్టాదశ శక్తి పీఠాల సమాచారం చదవండి.

ఆది శక్తిపీఠాలు
  1. పూరీ - విమల పీఠం - పాద ఖండం
  2. బరంపురం - తారా తరణి - స్థన ఖండం 
  3. గౌహతి - కామాఖ్య - యోని ఖండం
  4. కలకత్తా - దక్షిణ కాళిక - ముఖ ఖండం
సతీదేవి యొక్క ముఖము, స్థనములు, యోని, పాదములు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలలో అతి ముఖ్యమైనవిగా, ఆది శక్తి పీఠాలుగా చెప్పబడినవి.  కాళిక పురాణం ప్రకారం

విమల పాద ఖండాంచ
స్థన ఖండాంచ తారిణి
కామాఖ్య యోని ఖండాంచ
ముఖ ఖండాంచ కాళిక

అంగ ప్రత్యంగ సంగేనా
విష్ణు చక్ర క్షతే నచ !!


Vimala Pada khandancha,
Stana khandancha Tarini (Tara Tarini),
Kamakhya Yoni khandancha,
Mukha khandancha Kalika (Kali)
Anga pratyanga sangena
Vishnu Chakra Kshate nacha



No comments:

Post a Comment