Saturday, July 1, 2017

Adikailash Day3 - 20th June

Started the day at 4AM with a hot tea.  Quickly got ready and got into the bus at 6AM for a day long journey.

At noon, we reached one of the most spectacular places on the earth, "Patal Bhuvaneswar".  I have no words to describe the sacredness and brilliance of the place.  We witnessed naturally formed universe in those caves.  Got an opportunity to perform abhishek to Trimurti ling.

After that, it was another 8 hours of tedious journey. Reached Dharchula at 10PM.  We were called for a meeting to discuss about the trek, horse rates etc. We then had dinner and hit the bed.


ఉదయాన్నే, 4 గంటలకే వేడి వేడి ఏకాక్షరితో మాకు మేలుకొలుపు.  త్వరత్వరగా తయారై, 6 గంటలకల్లా బస్సు ఎక్కేసాం.  ఈ రోజంతా బస్సు ప్రయాణమేనంట.

మధ్యాహ్నానికి అవని లో విశ్వాన్ని చూసాం.  నిజంగా నిజం.  "పాతాళ భువనేశ్వర్" చూస్తే, మీరు కూడా ఒప్పుకుంటారు, నేను చెప్పింది నిజమే అని.  చూసి తీరాల్సిన ఒక అద్భుతమైన ప్రదేశం.  ప్రకృతి, శివుడు వేరు కాదు అని మరోసారి మనకి గుర్తు చేసే గుహలు, అందులోని ఆకారాలు, ప్రాకారాలు, శివ లింగాలు - మహాద్భుతం.  అటువంటి ప్రదేశంలో త్రిమూర్తులు ముగ్గురూ కలిసి, మూడు లింగాలు గా వెలిశారు.  వారికి అభిషేకం చేసుకున్న ఈ చేతులు నిజంగానే పుణ్యం చేశాయి కదూ.

మరలా బస్సు లో కూర్చొని అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాం.  చివరకు రాత్రి 10 కి Dharchula చేరుకున్న మాకు ఇంకొకసారి చెయ్యబోయే ప్రయాణం, గుఱ్ఱాలు గురించి వివరించారు. 

No comments:

Post a Comment