Here comes the toughest trek of the Yatra, 4km steep hill to Chiyalake. It was very very hard and lots of calories burnt. Few army people were also trekking at the same time. And one of them, helped me while trekking by holding my hand and my bag. It was awesome to hold the hand of Indian army person. Lucky, right??
After breakfast, we found a truck to hire till the destination. Of course, we grabbed the opportunity and reached Gunji by 12:30pm. By the way, did I tell you that we didn't bath for two days ?? Today, each of us had a nice bathe with hot water.
After a while, we discussed among ourselves and decided that we would opt for ponies (horse rides). Not only that the upcoming trek is hard, we may not be able to concentrate because of travel sickness. And that's it, we opted for ponies.
సామీ... ఇంత దూరాన, ఇంత పైన ఉన్నావేంటయ్యా.... అనిపించేలా ఉన్న క్లిష్టమైన 4km ఈ రోజే ఎక్కేసాం. ఈ కొండ ఎక్కడం సామాన్యమైన విషయం కాదు సుమా!!! భారత జవాను రూపంలో శివయ్య కాస్త సాయం పట్టేడు కాబట్టి సరిపోయింది. లేకుంటే, వామ్మో...
ఆ తరువాత 14km నడక ఉంది. టిఫిన్ చేసి ఇంకా బయలుదేరుదాం అనుకుంటుండగా, ఒక జీపు దొరికింది. వెంటనే ఎక్కేసి, 12:30 కల్లా Gunji చేరుకున్నాం. రెండు రోజులు స్నానం చెయ్యకపోతే, ఎన్నాళ్ళో అయినట్టుంది. హాయిగా వేడి నీళ్లతో జలకాలాడి, హిమగిరి సొగసులు చూస్తూ , సాయంత్రం దాకా గడిపేసాం.
కొంచెం ఆలోచించి చూడగా, గుఱ్ఱం మాట్లాడుకుంటే నయం అనిపించింది - ఆది కైలాసం వెళ్ళాకా, శివుని పైన మనసుండాలి కానీ, ఈ శరీరం మీద ఉండకూడదు కదా అని అనుకున్నాం.
No comments:
Post a Comment