Saturday, July 1, 2017

Adikailash Day9 - 26th June

After a mesmerizing holi dip yesterday, I wanted to go there again and have another round of bathe.  Started 6am in the morning again to Parvati Sarovar, had another holy bathe.  The time has stopped and didn't realise that I spent over an hour in that chilled water and freezing temperature.

From there, we went to Adikailash base - where Gauri Kund is there.  Weather started to help us and slowly clouds were cleared.  And Adikailash is in our sight at the least distance possible.  We offered puja and spent good time there.   After this unforgettable experience, we returned to Kuti by evening.



అంత పవిత్రమైన ప్రదేశంలో సర్వపాపనాశనకరమైన పార్వతీ సరోవరం లో ఇంకొక్కమారు మునిగి తరించాలని కోరిక కలగడం సహజమే కదా !!!  అందుకే, మళ్ళీ తెల్లవారుతూనే పార్వతీ సరోవరానికి వెళ్లి ముమ్మారు మునిగి తరించాను.   గంటసేపు ఉన్నానన్న విషయం కూడా గమనించలేనంతగా ఉంది, నా పరిస్థితి.   మంచులాంటి నీరు కదా, వొళ్ళు కాసేపు కర్రకట్టేసింది.   అది కూడా ఆనందమే కదా.

అక్కడ నుంచి, ఆది కైలాస శిఖరం సమీపానికి చేరుకున్నాం.  అక్కడ గౌరీకుండం ఉంది.  ఆదికైలాసం పై నుంచి మంచు కరిగి నీరుగా మారి, కుండంలా ప్రవహిస్తోంది.   అక్కడ కూర్చుంటే, శివుని పాదాల చెంత కూర్చున్నట్టే ఉంది.  కాసేపు ఆయన్ని చూస్తూ,  కాసేపు పూజలు చేస్తూ , కాసేపు మైమరచిపోతూ... అలా అలా కాలం గడిచిపోయింది.   మిగతా బృందం అంతా వెళ్లిపోయారు.   సాయంత్రానికి తిరిగి Kuti చేరుకున్నాం. 

No comments:

Post a Comment